Header Banner

లిక్కర్ స్కాంలో కీలక మలుపు.. అరెస్ట్‌కు రంగం సిద్ధం! పలువురు ముఖ్య నేతల పేర్లు లిస్ట్ లో!

  Sat Apr 05, 2025 15:24        Politics

ఏపీ రాజకీయాల్లో అనూహ్య పరిణామాలు చోటు చేసుకుంటున్నాయి. కూటమి ప్రభుత్వం వైసీపీ ముఖ్య నేతల పై గురి పెట్టింది. వైసీపీ ప్రభుత్వ హయాంలో అక్రమాలు జరిగాయనే ఆరోపణల పై విచారణలు జరుగుతున్నాయి. ఈ కేసుల్లో పలువురు ముఖ్య నేతల పేర్లు ఉన్నాయి. లిక్కర్ స్కాం పైన విచారణ చేస్తున్న సీఐడీ ఇప్పుడు ఎంపీ మిథున్ రెడ్డి కోసం ఢిల్లీ చేరుకుంది. ఈ కేసులో ఎంపీ మిథున్ రెడ్డి పాత్ర పైన ఆరోపణలు ఉన్నాయి. హైకోర్టు మిథున్ ముందస్తు బెయిల్ పిటీషన్ డిస్మి స్ చేసిన మరుసటి రోజునే సీఐడీ రంగంలోకి దిగటం.. ఢిల్లీలో తాజా పరిణామాలు సంచలనంగా మారుతున్నాయి.
మిథున్ కోసం సీఐడీ
లిక్కర్ కేసులో వైసీపీ లోక్ సభా పక్ష నేత మిథున్ రెడ్డి అరెస్ట్ కు రంగం సిద్దం అయింది. లిక్కర్ స్కాం లో మిథున్ పైన ఆరోపణలు ఉన్నాయి. ఈ కేసులో సీఐడీ ఇప్పటికే పలువురిని విచారణ చేసింది. మాజీ ఏపీబీసీఎల్ ఎండీ వాసుదేవ రెడ్డి విచారణ సమయంలో మిథున్ రెడ్డి ప్రమేయం గురించి సమాచారం ఇచ్చినట్లు తెలుస్తోంది. ఈ కేసులో తనను అరెస్ట్ చేస్తారని భావించిన మిథున్ హైకోర్టులో ముందస్తు బెయిల్ పిటీషన్ దాఖలు చేసారు. ఈ కేసులో మిథున్‌రెడ్డిని నిందితుడిగా చేర్చలేదని, రికార్డులను పరిశీలిస్తే ఈ దశలో ఆయనపై ఎలాంటి నేరారోపణలూ లేవని తెలిపింది. ఖజానాకు రూ.వేల కోట్ల నష్టం జరిగిందన్న ఆరోపణలపై దర్యాప్తు కొనసాగుతోందని, దర్యాప్తు అధికారి కూడా తన ముందున్న సమాచారం సరైనదా? కాదా? అని ఇంకా పరిశీలించుకోవాల్సి ఉందని పేర్కొంది.


ఇది కూడా చదవండి: వైసీపీకి దిమ్మతిరిగే షాక్! పార్టీని విడిచిపోతున్న కీలక నేత!


అరెస్ట్ కు రంగం సిద్దం
లిక్కర్ కేసు దర్యాప్తు ప్రాథమిక దశలో ఉంది, ఈ దశలో అరెస్ట్‌ చేస్తారనే ఆందోళన అవసరం లేద ని స్పష్టంచేసింది. ఈ నేపథ్యంలో ముందస్తు బెయిల్‌ పిటిషన్‌కు విచారణార్హత లేదని పేర్కొంది. పోలీసుల చర్యలపై ఏమైనా అభ్యంతరం ఉంటే చట్టపరంగా ఉన్న ప్రత్యామ్నాయ మార్గాలను ఆశ్రయించేందుకు పిటిషనర్‌కు వెసులుబాటు ఇచ్చింది. ఈ కేసులో మిథున్‌రెడ్డిని నిందితుడిగా చేరిస్తే కోర్టును ఆశ్రయించేందుకు వీలుగా వారం ముందు నోటీసులు ఇచ్చేలా సీఐడీని ఆదేశించా లన్న సీనియర్‌ న్యాయవాది అభ్యర్థనను న్యాయమూర్తి తోసిపుచ్చారు. ఇప్పటికే వైసీపీలో కీలకంగా పని చేసిన విజయ సాయిరెడ్డి సైతం లిక్కర్ స్కాం పైన కీలక వ్యాఖ్యలు చేసారు. ఈ కేసులో కర్త, కర్మ, క్రియ అంతా కసిరెడ్డి రాజశేఖర్ రెడ్డి అని చెప్పుకొచ్చారు. భవిష్యత్ లో అవసరం అయితే మరింత సమాచారం ఇస్తానని పేర్కొన్నారు.
సుప్రీంకు మిథున్
ఇక, ఇప్పుడు ఎంపీ మిథున్‌రెడ్డి అరెస్టుకు ఢిల్లీలో ఏపీ సీఐడీ బృందాలు చేరాయనే సమాచారం సంచలనంగా మారుతోంది. హైకోర్టులో ముందస్తు బెయిల్ డిస్మిస్ చేసిన మరుసటి రోజునే ఈ పరిణామం చోటు చేసుకోవటం చర్చగా మారుతోంది. మిథున్ రెడ్డి ఢిల్లీలో ఉన్నారనే సమాచారం సీఐడీ బృందాలు చేరుకున్నట్లు తెలుస్తోంది. ఇదే సమయంలో హైకోర్టు తన ముందస్తు బెయిల్ పిటీషన్ డిస్మిస్ చేయటంతో.. మిథున్ రెడ్డి సుప్రీంకోర్టును ఆశ్రయించారు. ఈ కేసు వ్యవహారాలను ఇప్పటికే టీడీపీ ఎంపీ లావు శ్రీక్రిష్ణ దేవరాయులు కేంద్ర హోం మంత్రి అమిత్ షాకు అందించారు. ఈడీ సైతం జోక్యం చేసుకునే అవకాశం ఉందని చెబుతున్నారు. దీంతో, ఇప్పుడు సీఐడీ ఎంపీ మిథున్ తో పాటుగా వైసీపీ నేతల విషయంలో ఎలాంటి చర్యలు తీసుకుంటారనేది రాజకీయంగా ఉత్కంఠ పెంచుతోంది.


అన్ని రకాల వార్తల కోసం  ఇక్కడ క్లిక్ చేయండి

మీకు ఈ న్యూస్ కూడా నచ్చవచ్చు:

 ఆ కీలక ప్రాజెక్టుకు వీడనున్న సంకెళ్లు! మంత్రి సంచలన నిర్ణయం!

 

వివేక హత్య వెనుక మర్మం! అసలు వ్యక్తి మొదట అక్కడే! ఆ తర్వాత ఏం జరిగిందంటే?

 

ముగిసిన ఏపీ కేబినెట్ భేటీ.. తీసుకున్న కీలక నిర్ణయాలివే.! వారికి గుడ్ న్యూస్..

 

రూ.119 కోట్లు తప్పుదారిపట్టించిన రోజా.. ఆమె అరెస్టు పక్కా! ఎవ్వరూ ఆపలేరు..

 

రుషికొండ ప్యాలెస్‍పై మంత్రులతో సీఎం చర్చ! కీలక ఆదేశాలు.. సుమారు 400-500 కోట్ల రూపాయలుగా..

 

ఏపీ ప్రభుత్వానికి మరో శుభవార్త.. అమరావతికి వరల్డ్ బ్యాంక్ నిధులు.! రాజధాని నిర్మాణంలో దూసుకుపోవడమే..

 

తిరుమల వెళ్లే భక్తులకు గుడ్ న్యూస్ - 100 శాతం ప్రక్షాళన.. టీటీడీ సమీక్షలో సీఎం కీలక ఆదేశాలు!

 

ఏపీ ప్రజలకు పండగలాంటి వార్త.. మరో బైపాస్కు గ్రీన్ సిగ్నల్! ఆ నాలుగు గ్రిడ్ రోడ్లు శాశ్వతంగా.. ఇక స్థలాలకు రెక్కలు?

 

సీఐడీ కస్టడీకి రంగా!… వంశీ గుట్లన్నీ వీడినట్టే.ఈ కేసులో కీలక పరిణామం..!

 

పార్టీ కార్యకర్తలతో మీటింగ్‌లో చంద్రబాబు కీలక వ్యాఖ్యలు! దీని ఆధారంగా నామినేటెడ్పార్టీలో పదవులు స్పష్టం!

 

మాజీ మంత్రికి షాక్.. మరోసారి నోటీసు జారీ చేసిన పోలీసులు!

 

కొడాలి నాని ఆరోగ్యంపై వైద్యుల షాకింగ్ ప్ర‌క‌ట‌న‌! నెటిజన్లు భారీగా కామెంట్లు - సోషల్ మీడియాలో హల్ చల్!

 

ఆంధ్ర  ప్రవాసి గ్రూప్ లో జాయిన్ అవ్వండి:

Whatsapp group

Telegram group

Facebook group



   #andhrapravasi #LiquorScam #PoliticalStorm #LeadersUnderRadar #BigNamesInvolved #CIDAction